డిచ్పల్లి, జనవరి 7
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
తెలంగాణ విశ్వ విద్యాలయంలోని హెల్త్ సెంటర్ను వైస్ చాన్స్లర్ రవిందర్ గుప్త తనిఖీ చేశారు. ఆసుపత్రిలో సరిపడా మందులు అందుబాటులో ఉంచాలని, డాక్టర్ అనూషకి వీసి సూచించారు.
విద్యార్థి ని విద్యార్థులకు, వర్సిటీ సిబ్బందికి సరైన వైద్య సేవలు అందించి, త్వరగా కోలుకునేలా చికిత్స అందించాలని, ఆసుపత్రిలో ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.