నిజామాబాద్, జనవరి 8
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బిసిల పోరుయాత్ర ముగింపు బహిరంగ సభకు ఆదివారం నాయకులు బయల్దేరి వెళ్లారు. ఈ సందర్భంగా బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు నీల నాగరాజు మాట్లాడుతూ చదువు కోసం సామాజిక న్యాయ సాధన కోసం తలపెట్టిన బీసీ పొరుయాత్ర డిసెంబర్ 2వ తేది నుండి జనవరి 8 వ తేదీ వరకు పాలమూరు నుండి పట్నం వరకు బిసీల పోరుయాత్ర దిగ్విజయంగా కొనసాగిందన్నారు.
గత నెల 19 నాడు మన కామారెడ్డిలో జరిగిన పోరుయాత్ర ఆదివారం ముగింపుకు వచ్చిన సందర్భంలో హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద జరిగే బహిరంగసభకి భారీ ఎత్తున విద్యార్థులు, యువజనులు, సంక్షేమ సంఘ నాయకులు పెద్ద ఎత్తున వెళ్లడం జరిగిందన్నారు.
పెరిగిన ధరలు ప్రకారం ప్రభుత్వం ఎమ్మెల్యేల జీతాలు పెంచిందని, సంక్షేమ హాస్టళ్లు, గురుకుల పాఠశాలల్లో వుండే విద్యార్థుల మెస్ చార్జీలు, స్కాలర్షిప్లు మాత్రం పెంచలేదని అన్నారు. జనాభా దామాషా ప్రకారం బీసీలకు రావాల్సిన హాక్కులు రావడం లేదన్నారు. రాబోవు రోజుల్లో బీసీ హక్కుల కోసం పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తాం అని అన్నారు.
కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు నీల నాగరాజు, సంక్షేమ సంఘం అధ్యక్షులు సాప శివరాములు, యువజన సంఘం అధ్యక్షులు సందీప్, రాష్ట్ర కార్యదర్శి నాగరాజు గౌడ్, ప్రధాన కార్యదర్శులు మహేష్, సంతోష్, ఉపాధ్యక్షులు మోహణాచారి, దోమకొండ వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటస్వామి, తాడ్వాయి మండల అధ్యక్షులు శ్రీధర్ రావ్, సీనియర్ నాయకులు మల్లన్న, సత్యనారాయణ, రాహులు తదితరులు పాల్గొన్నారు.