కామారెడ్డి, జనవరి 8
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రేపు అనగా 9వ తేదీ సోమవారం కామారెడ్డి పట్టణంలోని కాకతీయ నగర్ సబ్స్టేషన్, హౌసింగ్ బోర్డ్ సబ్ స్టేషన్ పరిధిలో గల కాలనీలు, హూసింగ్ బోర్డ్ కాలనీ, దేవునిపల్లీ, విద్యానగర్, కాకతీయ నగర్ మరియు నరసన్న పల్లి సబ్స్టేషన్, రాజంపేట సబ్స్టేషన్, చిన్న మల్లారెడ్డి సబ్ స్టేషన్, పరిధిలో గల గ్రామాలకు విద్యుత్ మరమ్మత్తుల కారణంగా మధ్యాహ్నం 1 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని, పై సబ్ స్టేషన్లలోని రైతులకు ఉదయం 3 గంటల నుండి 3 ఫేస్ సప్లయ్ ఇవ్వబడుతుందని, కావున వినియోగదారులు సహకరించగలరని కామారెడ్డి డివిజనల్ ఇంజనీర్ ఇ.సాలియ నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు.