కామారెడ్డి, జనవరి 9
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి, వాటిని సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంకు హాజరై ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
ప్రజావాణి సమస్యలపై సంబంధిత శాఖల అధికారులు దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి, వారికి న్యాయం జరిగేలా చూడాలన్నారు. పెండిరగ్ ఫిర్యాదులను సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించి పరిష్కారించాలని కోరారు.
ప్రజావాణిలో భూ సమస్యలు పరిష్కారం కోరుతూ వచ్చే దరఖాస్తులను రెవెన్యూ అధికారులు సత్వరమే పరిష్కారం చూపాలన్నారు. సోమవారం ప్రజావాణి కి మొత్తం 94 ఫిర్యాదులు వచ్చాయి. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే, శిక్షణ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, డిఆర్డిఓ సాయన్న ,ఎవో రవీందర్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.