డిచ్‌పల్లి, జనవరి 9
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వ విద్యాలయం పరిధిలో సోమవారం ఉదయం జరిగిన యూజీ 2 వ సెమిస్టరు బ్యాక్‌లాగ్ పరీక్షలో 1571 మంది విద్యార్థులకు గాను 1425 మంది హాజరయ్యారని, 143 మంది గైర్ హాజరు అయ్యారని, మధ్యాహ్నం జరిగిన 5వ, 6వ సెమిస్టరు పరీక్షలో 10 వేల 264 కి గాను 9053 మంది హాజరయ్యారని 731 మంది గైర్హాజరయ్యారని సివోఈ ప్రొఫెసర్ అరుణ తెలిపారు.
ఆర్మూర్‌లోని నరేంద్ర, సిద్దార్థ, విజేత పరీక్ష కేంద్రాలను సీవోఈ తనిఖీ చేశారు. ఎస్‌ఎస్‌ఆర్ డిగ్రీ కళాశాల నిజామాబాదులోని సెంటర్‌లో 5వ సెమిస్టరు పరీక్షలో తెలుగు సబ్జెక్ట్‌లో ఒకరు మాల్ ప్రాక్టీస్ చేస్తూ బుక్ అయ్యారు.
మెయిన్ క్యాంపస్‌లో ఉదయం జరిగిన పీజీ మొదటి సెమిస్టరు (బ్యాక్ లాగ్ ) పరీక్షలో 120 మంది అభ్యర్థులు కు గాను 94 మంది పరీక్షలు రాసారని, 31 మంది గైర్హాజరయ్యారని మరియు పీజీ 3వ సెమిస్టరు బ్యాక్ లాగ్ మధ్యాహ్న పరీక్షలో 101 మంది అభ్యర్థులకు గాను 92 మంది పరీక్ష రాసారని 9 మంది గైర్హాజరు అయ్యారని తెలిపారు.