బోధన్, జనవరి 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బోధన్ మండలంలోని జాడీ జమాల్పూర్ గ్రామం మీదుగా అక్రమంగా తరలిస్తున్న 500 క్వింటాళ్ల పిడిఎస్ బియ్యం పట్టుకున్నట్లు ఏసీపీ కిరణ్ కుమార్ తెలిపారు. మంగళవారం పట్టణంలోని రూరల్ సీఐ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ కిరణ్ కుమార్ మాట్లాడుతూ పోలీస్ కమిషనర్ నాగరాజు ఉత్తర్వుల ప్రకారం జాడీ జమాల్ పూర్ గ్రామం మీదుగా అక్రమంగా …
Read More »Daily Archives: January 10, 2023
క్యాలెండర్ ఆవిష్కరణ
కామారెడ్డి, జనవరి 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మంగళవారం కామారెడ్డి జిల్లా తెలంగాణ సహకార శాఖ గెజిటెడ్ మరియు నాన్ గెజిటెడ్ ఉద్యోగుల క్యాలెండర్ ఆవిష్కరణ స్థానిక కలెక్టరేట్ ప్రాంగణంలో జిల్లా సహకార అధికారిని బి వసంతం చే ఆవిష్కరించబడినది. కార్యక్రమంలో టిసిఎల్ జీవో అధ్యక్షులు యు. సాయిలు మాట్లాడుతూ ఉద్యోగులందరూ ఐక్యమత్యంతో సంఘటితంగా పనిచేయాలని తెలిపారు. అందరికీ నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో …
Read More »ప్రవేశ పరీక్ష గోడప్రతుల ఆవిష్కరణ
నిజామాబాద్, జనవరి 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ సాంఘిక సంక్షేమ, గిరిజన గురుకుల కళాశాలలు ఉమ్మడిగా నిర్వహించే ప్రవేశ పరీక్ష టీజీయూజీ సెట్ – 2023 ను పురస్కరించుకుని రూపొందించిన గోడప్రతులను కలెక్టర్ సి.నారాయణ రెడ్డి మంగళవారం తన చాంబర్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, టీజీయూజీ సెట్ – 2023 ప్రవేశ పరీక్షకు హాజరు కావాలనుకునే ఆసక్తి, అర్హత కలిగిన వారు ఫిబ్రవరి …
Read More »ఈవీఎం గోడౌన్‌ను సందర్శించిన కలెక్టర్
నిజామాబాద్, జనవరి 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా కేంద్రంలోని వినాయకనగర్‌లో గల ఈవీఎం గోడౌన్‌ను కలెక్టర్ సి.నారాయణరెడ్డి మంగళవారం పరిశీలించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం గోడౌన్ సీల్‌ను తెరిచారు. ఈవీఎంలు, బ్యాలెట్ యూనిట్ లు, ఎన్నికల సామాగ్రిని భద్రపరిచిన గదులను పరిశీలించారు. భద్రతా ఏర్పాట్ల నడుమ కొనసాగిన మరమ్మతు పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. తుది దశ …
Read More »సిద్దులగుట్ట అభివృద్ధికి విస్తృత అవకాశాలు
ఆర్మూర్, జనవరి 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రకృతి పరంగా సహజ సిద్ధమైన వాతావరణంలో వెలసిన ఆర్మూర్ సిద్దుల గుట్ట శ్రీ నవనాథ సిద్దేశ్వర ఆలయం ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు విస్తృత అవకాశాలు ఉన్నాయని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అన్నారు. ఈ దిశగా సిద్దులగుట్ట ప్రాంతాన్ని సుప్రసిద్ధ ఆధ్యాత్మిక క్షేత్రంగా, ఆకర్షణీయమైన పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందిస్తామని పేర్కొన్నారు. సిద్దుల గుట్ట వద్ద …
Read More »నర్సరీని పరిశీలించిన రాష్ట్ర అధికారులు
కామారెడ్డి, జనవరి 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, ఉద్యానవన డైరెక్టర్ ఎం. హనుమంతరావు మంగళవారం కామారెడ్డి కలెక్టరేట్‌కు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే, శిక్షణ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, జిల్లా ఉద్యానవన శాఖ అధికారులు పుష్పగుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు. అనంతరం ఆయన జిల్లాలోని నస్రుల్లాబాదులో …
Read More »యువకుడి ఆత్మహత్య
మాక్లూర్, జనవరి 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మాక్లూర్ మండలం మాదాపుర్ గ్రామంలో ఆర్థిక ఇబ్బందులతో యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానిక ఎస్సై యాదగిరి గౌడ్ కథనం ప్రకారం మాదాపూర్‌కు చెందిన అరుణ్ కుమార్ గౌడ్ (30) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అరుణ్ కుమార్ గౌడ్ కిరాణా దుకాణం నిర్వహిస్తు తన కుటుంబాన్ని పోషించేవాడు. కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో మహిళ …
Read More »షాక్ సర్క్యూట్‌తో నివాస గుడిసె దగ్ధం
నవీపేట్, జనవరి 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నవీపేట్ మండలంలోని ఫతేనగర్ గ్రామంలో నివాస గుడిసె దగ్ధం అయినట్లు తహసీల్దార్ వీర్ సింగ్ తెలిపారు. స్థానికులు తహసీల్దార్ సమాచారం ప్రకారం ఫతేనగర్ గ్రామానికి చెందిన విజయ కూలి పనుల కోసం వెళ్లగా షాట్ సర్క్యూట్‌తో మంగళవారం మధ్యాహ్నం మంటలు అంటుకోవడంతో గమనించిన చుట్టుపక్కల వారు, స్థానికులు వచ్చి మంటలను అర్పేశారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ వీర్ సింగ్ …
Read More »