మాక్లూర్, జనవరి 10
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మాక్లూర్ మండలం మాదాపుర్ గ్రామంలో ఆర్థిక ఇబ్బందులతో యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానిక ఎస్సై యాదగిరి గౌడ్ కథనం ప్రకారం మాదాపూర్‌కు చెందిన అరుణ్ కుమార్ గౌడ్ (30) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అరుణ్ కుమార్ గౌడ్ కిరాణా దుకాణం నిర్వహిస్తు తన కుటుంబాన్ని పోషించేవాడు.
కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో మహిళ సంఘాలలో, బయట ఇతర రుణాలు తీసుకొని జీవనం సాగిస్తున్నాడు. ఇంతలోనే రుణాలు చెల్లించాల్సిన గడువు రావడంతో ఎక్కడా తనకు డబ్బు లభించకపోవడంతో ఎలా చెల్లించాలనే మనస్తాపంతో ఆర్థిక ఇబ్బందులతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై యాదగిరి గౌడ్ తెలిపారు.