కామారెడ్డి, జనవరి 16
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన రుక్సానా (23) గర్భిణి అనిమియా వ్యాధితో ప్రభుత్వ వైద్యశాలలో బాధపడుతుండడంతో వారికి కావాల్సిన రక్తం రక్త నిధి కేంద్రాలలో లభించకపోవడంతో వారి బంధువులు రెడ్ క్రాస్ జిల్లా మరియు ఐవీఎఫ్ తెలంగాణ రాష్ట్ర రక్తాతల సమన్వయకర్త డాక్టర్ బాలు రెడ్ క్రాస్ డివిజన్ సెక్రెటరీ జమీల్ సంప్రదించారు.
పట్టణ కేంద్రానికి చెందిన నదీమ్ సహకారంతో ఒ పాజిటివ్ రక్తాన్ని వీటి ఠాకూర్ రక్తనిధి కేంద్రంలో అందజేసినట్లు పేర్కొన్నారు. రక్తదానానికి ముందుకొచ్చిన రక్తదాత నదీమ్‌కు కామారెడ్డి జిల్లా కలెక్టర్ రెడ్ క్రాస్ జిల్లా అధ్యక్షుడు పాటిల్ తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త తరఫున అభినందనలు తెలిపారు.
సమాజంలో చాలామందికి రక్తదానం పట్ల అపోహలు ఉన్నాయని రక్తదానం చేయడం వల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. రక్తదానం పట్ల అవగాహన పెంపొందించుకొని ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలన్నారు. కార్యక్రమంలో టెక్నీషియన్లు చందన్, ఏసు గౌడ్ పాల్గొన్నారు.