నందిపేట్, జనవరి 16
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వము కొత్తగా ఏర్పాటు చేసిన డొంకేశ్వర్ మండలం వెళ్లడానికి మారంపల్లి, గంగాసందర్ గ్రామాలకు బస్సు సౌకర్యం లేదని, ఈ విషయము పలుమార్లు రీజనల్ మేనేజర్ ఆర్టీసీకి, డివిఎం, ఆర్మూర్ డిఎం లకు విన్నవించుకున్న ఫలితం దక్కడం లేదని బిజెపి రాష్ట్ర ఓబిసి మోర్చా ఉపాధ్యక్షులు మారంపల్లి గంగాధర్, జిల్లా బిజెపి కార్యదర్శి సురేందర్, జిల్లా రైతు విభాగం ఉపాధ్యక్షులు అన్నారం సంజీవ్, ఎంపీటీసీ సోనా చిన్నారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
మారంపల్లి, గంగాసముందర్ రోడ్డు ద్వారా అంటే ఆర్మూర్ నుండి వన్నెల్ .కె. మారంపల్లి ద్వారా కొత్త బస్ సర్వీసును నడిచే విధంగా చూడాలని కోరారు. అంతేకాదు డొంకేశ్వర్ మండలంలోని 10 గ్రామాల వారికి ఈ మార్గం ద్వారా ఒక బస్సు నడిపినట్లయితే ఆర్మూర్‌లో గల రెవెన్యూ కార్యాలయం కోర్టు రిజిస్ట్రేషన్ కార్యాలయము దగ్గర అవుతుందన్నారు. కావున బస్సును వెంటనే ప్రారంభించాలని తెలంగాణ రవాణా శాఖ అధికారులను కోరారు.