ఆర్మూర్, జనవరి 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ పట్టణంలోని జావిద్ భాయ్ మినీ స్టేడియంలో ఏఅర్‌ఏ మెమోరియల్ సీజన్ 5 జిల్లాస్థాయిలో జరిగిన క్రికెట్ పోటీలు ఘనంగా ముగిశాయి. జిల్లాస్థాయి జట్ల పోటీల్లో నిజామాబాద్ క్రికెట్ జట్టుకు సంబంధించిన మూజ్ 11 మొదటి ట్రోఫీని, కోరుట్ల క్రికెట్ జట్టు రెండవ ట్రోఫీని ఆర్మూర్ పట్టణ సిఐ సురేష్ బాబు చేతుల మీదుగా విజేతలకు అందజేశారు.
శారీరక దృఢత్వానికి, మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతగానో దోహదం చేస్తాయని వారన్నారు. కార్యక్రమానికి కాంగ్రెస్ మైనార్టీ సెల్ పట్టణ అధ్యక్షుడు యస్ కే బబ్లు, ఆనంద్ షాపింగ్ మాల్ యజమాన్యం ఋషి, పట్టణ ఏఎస్‌ఐ గఫర్, తదితరులు పాల్గొన్నారు.