కామారెడ్డి, జనవరి 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జాతీయస్థాయి సౌత్ జోన్ సీనియర్ బాలికల షూటింగ్ బాల్ పోటీల్లో గాంధారి మండలం పోతంగల్ గ్రామానికి చెందిన ప్రణీత, సింధు బంగారు పతకాలను సాధించారు. సీనియర్ బాలుర విభాగంలో అభిలాష్ రెడ్డి ద్వితీయ స్థానం పొందారు. జూనియర్ విభాగంలో సాయి కృష్ణ ద్వితీయ స్థానం నిలిచారు. జాతీయస్థాయిలో పతకాలు సాధించిన క్రీడాకారులను మంగళవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అభినందించారు.
బాలికలు క్రీడల్లో జాతీయస్థాయిలో పతకాలు పొందడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. షూటింగ్ బాల్ గురించి కోచ్ లక్ష్మణ్ రాథోడ్ కలెక్టర్కు వివరించారు. కార్యక్రమంలో జిల్లా షూటింగ్ బాల్ అధ్యక్షుడు సాయి కుమార్, గాంధారి జడ్పిటిసి సభ్యుడు శంకర్ నాయక్, సర్పంచ్ సంజీవ్, జిల్లా యువజన, క్రీడల అధికారి దామోదర్ రెడ్డి, టీఎన్జీవోఎస్ జిల్లా కార్యదర్శి సాయిలు, పేట సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రంగ వెంకటేశ్వర్ గౌడ్, నోముల మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు.