కంటి వెలుగు శిబిరం ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, జనవరి 17

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దృష్టి లోపాలను దూరం చేసేందుకు వీలుగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభించేందుకు జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లలో నిమగ్నమయ్యింది. ఈ నెల 19న జిల్లా కేంద్రంలోని వినాయక్‌ నగర్‌ లోని మహిళా భవనంలో ఉదయం 9.00 గంటలకు కంటి వెలుగు శిబిరాన్ని ముఖ్య అతిథులచే లాంఛనంగా ప్రారంభించి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు.

ఈ మేరకు విస్తృత స్థాయిలో చేపడుతున్న ప్రారంభోత్సవ ఏర్పాట్లను మంగళవారం కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి పరిశీలించారు. ఏర్పాట్లలో ఎలాంటి లోపాలకు తావులేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. అవసరమైన వారికి నేత్ర పరీక్షలు నిర్వహించి, మందులు, కంటి అద్దాలు అందించేలా ప్రణాళికాబద్ధంగా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకునేలా విస్తృత ప్రచారం నిర్వహించాలని, 18 సంవత్సరాలకు పైబడి వయస్సు కలిగిన ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు నిర్వహించుకునేలా చూడాలన్నారు. కలెక్టర్‌ వెంట అదనపు కలెక్టర్లు చిత్రామిశ్రా, చంద్రశేఖర్‌, నిజామాబాద్‌ ఆర్డీఓ రవి, డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ సుదర్శనం, మెప్మా పీ.డీ రాములు, సీడీపీఓ సౌందర్య తదితరులు ఉన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »