Daily Archives: January 18, 2023

నందమూరి తారక రామారావుకు ఘన నివాళులు

బోధన్‌, జనవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలుగు ఉమ్మడి రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 27 వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో బోధన్‌ పట్టణ శివారులోని కమ్మ సంఘం భవనంలో బుధవారం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రక్తదాన శిబిరంలో మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ దంపతులు తూము పద్మావతి,శరత్‌ రెడ్డి నందమూరి అభిమానులు 200 మందికి పైగా …

Read More »

బైక్‌ పై నుండి పడి యువకుని మృతి…

ఎడపల్లి, జనవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎడపల్లి మండల కేంద్రం శివారులో సాటాపూర్‌ గేటు డీఎం ఫంక్షన్‌ హాల్‌ వద్ద బోధన్‌-నిజామాబాద్‌ ప్రధాన రహదారిపై రోడ్డు పక్కన గల హద్దు రాళ్లను ఢీకొని యువకునికి తీవ్రగాయాలై మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి.. ఎడపల్లి మండలంలోని వడ్డే పల్లి గ్రామానికి చెందిన ఇమామ్‌ అనే యువకుడు బైక్‌ పై ఎమ్మెస్సి ఫారం నుండి బోధన్‌ వైపు వెళుతూ …

Read More »

భూములు కోల్పోయిన రైతులకు పరిహారాన్ని అందిస్తాం

నవీపేట్‌, జనవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నవీపేట్‌ మండలంలోని నేషనల్‌ హైవేలో భూములు కోల్పోయిన రైతులకు న్యాయం చేస్తామని నిజామాబాద్‌ ఆర్డీవో రవి కుమార్‌ అన్నారు. బుధవారం బోధన్‌ నుండి బైంసా వరకు వేయనున్న నేషనల్‌ హైవేలో భూములు కోల్పోయిన రైతులతో యంచ, మిట్టాపూర్‌, కొస్లీ జిపిలలో గ్రామసభలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మూడు గ్రామాల పరిధిలోని 295 మంది రైతులకు చెందిన 42 …

Read More »

జిల్లా కేంద్రంలో కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభించనున్న మంత్రి

నిజామాబాద్‌, జనవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దృష్టి లోపాలను దూరం చేయాలనే కృత నిశ్చయంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు-2 కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి కోరారు. ఈ నెల 19న (గురువారం) ఉదయం 9 గంటలకు నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని వినాయకనగర్‌ హౌసింగ్‌ బోర్డు కార్యాలయం సమీపంలో గల స్త్రీ శక్తి భవన్‌లో రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖామాత్యులు వేముల ప్రశాంత్‌ …

Read More »

రైతులను ఇబ్బంది పెడితే న్యాయపరంగా ముందుకు వెళ్తాం

కామారెడ్డి, జనవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాస్టర్‌ ప్లాన్‌ కు వ్యతిరేకంగా రైతుల ఉద్యమం చేస్తున్న రైతులు ఉద్యమంలో భాగంగా మున్సిపల్‌ కమిషనర్‌, కలక్టరేట్‌ లకు వచ్చిన రైతుల పట్ల నిర్లక్యం వహించినదుకు కామారెడ్డి జిల్లా కలెక్టర్‌, మున్సిపల్‌ కమిషనర్‌పై లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా రైతు ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు మాట్లాడుతూ మాస్టర్‌ ప్లాన్‌ విషయంలో రైతులు తీవ్రంగా నష్టపోతున్నందున ఉద్యమాలు …

Read More »

పసుపు బోర్డు ఏర్పాటు చేసి కనీస మద్దతు ధర ఇవ్వాలి

ఆర్మూర్‌, జనవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని, మద్దతు ధరలు కల్పిస్తామని ప్రకటించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముఖం చాటుచేసుకొని పసుపు రైతులను మోసం చేశాయని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్‌ శోభన్‌ విమర్శించారు. ఆర్మూర్‌ లోని మెడికల్‌ ఏజెన్సీ భవన్‌లో తెలంగాణ రైతు సంఘం నిజామాబాద్‌ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం సంఘం …

Read More »

బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం

ఆర్మూర్‌, జనవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా ఆలూరు మంఢలంలోని కల్లడి గ్రామానికి చెందిన దండుగుల పోశేట్టి ఈ నెల 9న దుబాయిలో ప్రమాదవశాత్తు మృతిచెందాడు. ఈ సందర్భంగా వడ్డెర వృత్తిదారుల సంఘం జిల్లా నాయకత్వానికి విషయం తెలియడంతో ఆ కుటుంబాన్ని కలిసి పరామర్శించి రూ. 5 వేలు ఆర్థిక సాయం చేశారు. ఈ సందర్భంగా వడ్డెర వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఇడగొట్టి …

Read More »

నిజామాబాద్‌లో కల్తీ కల్లును అరికట్టాలి

నిజామాబాద్‌, జనవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరంలో కల్తీ కళ్ళు అరికట్టాలని జిల్లా కలెక్టర్‌కు సిపిఐ ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించారు. నిజామాబాద్‌ నగరంలో డైజోఫామ్‌ క్లోరోఫామ్‌ ఆల్ఫాజామ్‌ మొదలగు వాటిని కలిపి కల్తీ కల్లు తయారు చేస్తూ ప్రజలను బానిసలుగా తయారు చేస్తూ తాగుబోతులుగ మారుస్తున్నారని, వేలాది లీటర్ల కల్తీ కల్లు అమ్ముతూ ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని తెలిపారు. ఒకవైపు ప్రభుత్వం …

Read More »

కంటి వెలుగు శిబిరాలను పరిశీలించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, జనవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం ఈ నెల19నుండి ప్రతిష్టాత్మకంగా ప్రారంభించనున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని పురస్కరించుకుని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి బుధవారం పలు శిబిరాలను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. మాక్లూర్‌ మండలం కల్లెడి గ్రామంలోని మున్నూరు కాపు సంఘం భవనంలో, బొంకన్‌ పల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో నెలకొల్పిన కంటి వెలుగు శిబిరాలను పరిశీలించి కంటి పరీక్షల నిర్వహణ కోసం చేపట్టిన ఏర్పాట్లను చూసి …

Read More »

వినియోగదారుల హక్కులను వినియోగించుకోవాలి

కామారెడ్డి, జనవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా వినియోగదారుల సంక్షేమ కౌన్సిల్‌కు రాష్ట్రానికి ఒక పేరు, జిల్లాలో నలుగురు పేర్లు ఎంపిక చేయాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో బుధవారం జిల్లా పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో జిల్లా వినియోగదారుల సంక్షేమ సంఘం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ మాట్లాడారు. జిల్లా వినియోగదారుల సంక్షేమ కౌన్సిల్‌ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »