కామారెడ్డి, జనవరి 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా వినియోగదారుల సంక్షేమ కౌన్సిల్‌కు రాష్ట్రానికి ఒక పేరు, జిల్లాలో నలుగురు పేర్లు ఎంపిక చేయాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో బుధవారం జిల్లా పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో జిల్లా వినియోగదారుల సంక్షేమ సంఘం సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ మాట్లాడారు. జిల్లా వినియోగదారుల సంక్షేమ కౌన్సిల్ లో ఎంపిక చేసే నాలుగు పేర్లలో ఒక మహిళా పేరు ఉండే విధంగా చూడాలని సూచించారు. వినియోగదారుల హక్కులను ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని కోరారు.
జిల్లా వినియోగదారుల సంక్షేమం కోసం ఎంపికైన ప్రతినిధులు కృషి చేయాలని పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా పౌర సరఫరాల అధికారిని పద్మ, అధికారులు, జిల్లా వినియోదారుల సంఘం అధ్యక్షురాలు బి. సువర్ణ, ప్రతినిధులు తోకల కిషన్, రావుల ప్రభాకర్ పాల్గొన్నారు.