కామారెడ్డి, జనవరి 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా రైతుల ఉద్యమం చేస్తున్న రైతులు ఉద్యమంలో భాగంగా మున్సిపల్ కమిషనర్, కలక్టరేట్ లకు వచ్చిన రైతుల పట్ల నిర్లక్యం వహించినదుకు కామారెడ్డి జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్‌పై లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా రైతు ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు మాట్లాడుతూ మాస్టర్ ప్లాన్ విషయంలో రైతులు తీవ్రంగా నష్టపోతున్నందున ఉద్యమాలు చేశామని మాస్టర్ ప్లాన్ చేసేటప్పుడు రైతులకు జోన్‌ల విషయంలో కనీస అవగాహన కల్పించలేదని తర్వాత ఉద్యమం చేసేటప్పుడు కార్యాలయాలకు రైతులు వస్తె కూడా నిర్లక్యంగా వ్యవహరించారని, దాదాపు 2వేల మంది రైతులు ర్యాలీగా కలెక్టరేట్ వద్దకు వస్తె వినతి పత్రం తీసుకోవడం కోసం కనీసం 5 నిమిషాల సమయం ఇవ్వని కలెక్టర్ తీరు పట్ల లోకాయుక్తలో కేసు పెట్టామని అన్నారు.
మాస్టర్ ప్లాన్ రద్దు అయ్యే వరకు రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో ఉద్యమం ఆగదని, రైతులకు ఇబ్బంది పెడితే న్యాయ పరంగా కూడా పోవడానికి సిద్దం అని అన్నారు.