బోధన్, జనవరి 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలుగు ఉమ్మడి రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 27 వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బోధన్ పట్టణ శివారులోని కమ్మ సంఘం భవనంలో బుధవారం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రక్తదాన శిబిరంలో మున్సిపల్ చైర్ పర్సన్ దంపతులు తూము పద్మావతి,శరత్ రెడ్డి నందమూరి అభిమానులు 200 మందికి పైగా రక్తదానం చేశారు.
లయన్స్ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత మధుమేహం పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసినవారికి జాడి జమాల్ పూర్ గ్రమస్తుడు మువ్వపూడి గోపాల్ రావ్ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో బోధన్ మండల కమ్మ సంఘం ప్రతినిధులు పల్లెంపాటి శివన్నారాయణ, గాంధీ, రంగారావు, రైసస మాజీ కోఆర్డినేటర్ బుద్దె రాజేశ్వర్, సాంబశివరావు, ఎన్టీఆర్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.