డిచ్పల్లి, జనవరి 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వ విద్యాలయం పరిధిలో బుధవారం ఉదయం జరిగిన యూజీ 4వ సెమిస్టరు (బ్యాక్లాగ్) పరీక్షలో 1803 మంది విద్యార్థులకు గాను 1690 మంది హాజరయ్యారని, 113మంది గైర్ హాజరు అయ్యారని సివోఈ ప్రొఫెసర్ అరుణ తెలిపారు.
బోధన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల పరీక్ష కేంద్రంలో 4వ సెమిస్టరు బ్యాక్ లాగ్ కార్పొరేట్ అకౌంటింగ్ పరీక్షలో ఒకరు డిబార్ అయ్యారని, ధర్పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల పరీక్ష కేంద్రంలో 4వ సెమిస్టరు బ్యాక్లాగ్ కార్పొరేట్ అకౌంటింగ్ పరీక్షలో మరొక విద్యార్ధి డిబార్ అయ్యారని అన్నారు.
అలాగే మధ్యాహ్నం జరిగిన 3వ సెమిస్టరు (రెగ్యులర్) పరీక్షలలో 8884 కి గాను 8212మంది హాజరయ్యారని 672మంది గైర్హాజరయ్యారని సివోఈ ప్రొఫెసర్ అరుణ వెల్లడిరచారు.