నవీపేట్, జనవరి 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నవీపేట్ మండలంలోని నేషనల్ హైవేలో భూములు కోల్పోయిన రైతులకు న్యాయం చేస్తామని నిజామాబాద్ ఆర్డీవో రవి కుమార్ అన్నారు. బుధవారం బోధన్ నుండి బైంసా వరకు వేయనున్న నేషనల్ హైవేలో భూములు కోల్పోయిన రైతులతో యంచ, మిట్టాపూర్, కొస్లీ జిపిలలో గ్రామసభలు నిర్వహించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ మూడు గ్రామాల పరిధిలోని 295 మంది రైతులకు చెందిన 42 ఎకరాల భూమిని కోల్పోతున్నారని గవర్నమెంట్ నిర్ణయం తీసుకున్న రైట్‌తో పాటు మార్కెట్ రేట్‌ను ట్యాలీ చేసి నష్టపరిహారం చెల్లిస్తామన్నారు. యంచలో ఇండ్లు కోల్పోయిన వారికి కూడ ఆదుకుంటామని అక్కడ రైతుల అభ్యంతరం మేరకు రిసర్వే చేయిస్తామని చెప్పారు. ఆయన వెంబడి తహసీల్దార్ వీర్ సింగ్, ఆర్.ఐ. మోహన్, వైస్ ఎంపిపి హరీష్, సర్పంచ్‌లు లహరి ప్రవీణ్, అనిత, బాధిత రైతులు పాల్గొన్నారు.