బోధన్, జనవరి 19
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దృష్టి లోపాలను దూరం చేయాలనీ ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రతిష్టత్మాకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు- 2 కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని బోధన్ ఎంపీపీ బుద్దె సావిత్రి రాజేశ్వర్ అన్నారు. గురువారం బోధన్ శాసనసభ్యులు ఎండీ షకీల్ ఆమ్మేర్ ఆదేశాల మేరకు గురువారం సాలూర మండలం సాలూర, సాలంపాడ్, గ్రామాలలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు.
18ఏళ్ళు పూర్తి చేసుకున్న ప్రతి ఒక్కరు కంటి వెలుగు శిబిరాల్లో నేత్ర పరీక్షలు చేయుంచు కోవాలని ఎంపీపీ కోరారు. అవసరం ఉన్న వారికి శిబిరం లోనే మందులు దూర ద్రుష్టి లోపం ఉన్న వారికి కంటి అద్దాలు అంద చేస్తారనిఅన్నారు. కంటి వెలుగు కేంద్రాల్లో వచ్చిన వారికి అన్ని సౌకర్యాలు కల్పించాలని పంచాయతీ కార్యదర్శులకు ఆదేశించారు.
కార్యక్రమంలో సాలూర తహసీల్దార్ మమత, ఎంపీడీఓ మధుకర్, డాక్టర్ ప్రియాంక, టెక్నీషియన్ శ్రీనిత్య, ఏఎంసి వైస్ చైర్మన్ సాలూర షకీల్, బోధన్ మండలం బిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు నర్సయ్య, సర్పంచ్‌లు బుయ్యన్ చంద్రకల, యెడపల్లి పుష్ప, ఎస్ కే అమ్మీర్, చింతం నాగయ్య, సర్పంచ్‌ల సంఘం అధ్యక్షులు మద్దినేని శ్రీనివాస్ రావు, సాయిపటేల్, సహకార సంఘం చైర్మన్ అల్లె జనార్దన్, వార్డు సభ్యులు సరిడే సాయులు, శ్రీరాం గంగాధర్, దార్షె గంగాధర్, బిఆర్‌ఎస్ నాయకులు కేజీ గంగారాం, వెంకట్ పటేల్, కల్లూర్ లక్ష్మణ్, బిఆర్‌ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎస్. కే మౌలానా, సాలంపాడ్ ఉప సర్పంచ్ యూసుఫ్, సత్తార్, మల్లయ్య పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్, ఐసిడిఎస్ సూపర్‌వైజర్ గంగావేణి, అంగన్వాడీ టీచర్లు, ఆశ వర్కర్‌లు తదితరులు పాల్గొన్నారు.