కామారెడ్డి, జనవరి 19
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దృష్టిలోపాలను దూరం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిందని రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ ముజీబుద్దిన్ అన్నారు. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో 18వ వార్డులో గురువారం కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు నేత్ర పరీక్షలు చేయించుకోవాలన్నారు. జిల్లావ్యాప్తంగా 44 బృందాలను ఏర్పాటు చేశారని తెలిపారు. అవసరమైన వారికి శిబిరంలో గుర్తించి మందులు, కంటి అద్దాలు ఉచితంగా పంపిణీ చేస్తారని చెప్పారు. ఈ సందర్భంగా కంటి అద్దాలను పంపిణీ చేశారు.
కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ఇందుప్రియ, ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వరరావు, ఆర్డీవో శ్రీనివాస్ రెడ్డి, వార్డ్ కౌన్సిలర్ మీర్జా ఆఫీస్ బేగ్, బరాస నాయకులు నిట్టు వేణుగోపాలరావు, ప్రభాకర్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, వైద్యులు, అధికారులు పాల్గొన్నారు.