కామారెడ్డి, జనవరి 19
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి మున్సిపల్ కొత్త మాస్టర్ ప్లాన్ వల్ల నష్టపోతున్న రైతులకు మద్దతుగా, ప్రభుత్వ దోరణిలో నిరసనగా తాము 23 వ తేదీన రాజీనామా చేస్తామని బీజేపీ కౌన్సిలర్‌లు తెలిపారు.
ఈ సందర్భంగా బీజేపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మొటూరి శ్రీకాంత్ మాట్లాడుతూ కొత్త మాస్టర్ ప్లాన్ వల్ల నష్టపోతున్న రైతులు ఎన్నో ఉద్యమాలు చేసిన అనంతరం స్పందన లేకపోవటంతో 49 మంది కౌన్సిలర్‌లకు మాస్టర్ ప్లాన్ రద్దు చేయమని వినతి పత్రం ఇచ్చారని వారి విజ్ఞప్తి మేరకు ఈ నెల 10 వ తేదీన మున్సిపల్ కమిషనర్ గారికి సర్వసభ్య సమావేశం పెట్టి మాస్టర్ ప్లాన్ రద్దు చేయమని వినతి పత్రం ఇచ్చామని కాని స్పందన లేక పోవటంతో రైతు ఐక్య కార్యాచరణ కమిటీ పిలుపు మేరకు విలీన గ్రామాల బీజేపీ కౌన్సిలర్‌లు సుతారి రవి, కాసర్ల శ్రీనివాస్‌లు గురువారం రైతు ఐక్య కార్యచరణ కమిటీ సభ్యులతో కలిసి కమిషనర్‌కి రాజీనామా సమర్పిస్తారని, ఇప్పటికైనా కమిషనర్, కలెక్టర్ స్పందించి మాస్టర్ ప్లాన్ రద్దుకై తీర్మానం చేయాలని అన్నారు.
అప్పటికి కూడా సమావేశం పెట్టీ మాస్టర్ ప్లాన్ రద్దు చేయపోతే మిగిలిన 5 కౌన్సిలర్ లము కూడా 23 వ తేదీన రాజీనామా చేస్తామని అన్నారు.