రెంజల్, జనవరి 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండలంలోని నీల క్యాంప్‌లో ఎఫ్‌ఎంసీ కంపెనీ వారి ఆధ్వర్యంలో వరి పంటలో క్షేత్ర ప్రదర్శన నిర్వహించారు. రైతు దాసు గారి పొలంలో వారం రోజుల క్రితం ఎఫ్.ఎం.సి. వారి కర్ప్రైమ అనే మందును వాడి మోగి పురుగు, ఆకు చుట్టు పురుగు మరియు పచ్చపురుగులను సమర్థవంతంగా నియంత్రించడంతో పాటు పంట ఏపుగా పెరగడం జరిగింది.
ఈ మేరకు ఎఫ్.ఎం.సి. కంపెనీ ఏరియా మేనేజర్ అనిల్ కుమార్ మాట్లాడుతూ వరి పంటలో వచ్చే చీడపీడల నివారణ మరియు పోషకాలు యాజమాన్యం గురించి సూచనలు చేశారు. కార్యక్రమంలో మార్కెటింగ్ ఎక్జక్యూటివ్ రాజశేఖర్, సేల్స్ ఆఫీసర్ సాయిప్రసాద్, కంపెనీ ప్రతినిధులు మనీష్, రమేష్, మహేష్, రైతులు పాల్గొన్నారు.