అనీమియా వ్యాధిగ్రస్తుడికి రక్తదానం…

కామారెడ్డి, జనవరి 20

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా బిబీపేట్‌ మండలం తుజాల్‌ పూర్‌ గ్రామానికి చెందిన తలారి సుధాకర్‌ (40) అనీమియా వ్యాధితో బాధపడుతుండడంతో అత్యవసరంగా బి పాజిటివ్‌ రక్తం 3 యూనిట్లు అవసరం కావడంతో వారికి కావలసిన రక్తం రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో వారి కుటుంబ సభ్యులు రెడ్‌ క్రాస్‌ జిల్లా మరియు ఐవిఎఫ్‌ తెలంగాణ తెలంగాణ రాష్ట్ర రక్తదాతల సమన్వయకర్త డాక్టర్‌ బాలును సంప్రదించారు.

నిజామాబాద్‌ మరియు కామారెడ్డి జిల్లాల ఎయిడ్స్‌ నివారణ మరియు నియంత్రణ ప్రాజెక్టు మేనేజర్‌ సుధాకర్‌ సహకారంతో బి పాజిటివ్‌ రక్తాన్ని వి.టి.ఠాకూర్‌ రక్తనిధి కేంద్రంలో సకాలంలో అందజేయడం జరిగిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్‌ బాలు మాట్లాడుతూ ప్రపంచంలో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఎంతగా పెరిగినప్పటికీ అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి కావాల్సిన రక్తాన్ని మాత్రం తయారు చేయలేమన్నారు.

మానవతా దృక్పథంతో స్పందించినప్పుడే సకాలంలో రక్తాన్ని అందజేసి ప్రాణాలను కాపాడగలుగుతామన్నారు రక్తదానానికి ముందుకు వచ్చిన రక్తదాత సుధాకర్‌ కు తెలంగాణ రాష్ట్ర టూరిజం కార్పొరేషన్‌ డెవలప్మెంట్‌ చైర్మన్‌ ఉప్పల శ్రీనివాస్‌ గుప్తా మరియు కామారెడ్డి జిల్లా రెడ్‌ క్రాస్‌ అధ్యక్షులు మరియు కలెక్టర్‌ జిల్లా అధ్యక్షుడు జితేష్‌ వి పాటిల్‌ తరపున అభినందనలు తెలిపారు.

అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి సకాలంలో రక్తం లభించినట్లయితే 9492874006 నెంబర్‌ కి సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో బట్టు ఆనంద్‌ రాజ్‌,టెక్నీషియన్లు చందన్‌, ఏసు గౌడ్‌, కిషోర్‌ పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »