రెంజల్, జనవరి 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కేంద్ర ప్రభుత్వ పథకాలు గ్రామస్థాయిలో అమలు తీరుపై శుక్రవారం మండలంలోని దూపల్లి, కూనేపల్లి, కందకుర్తి గ్రామాలలో నేషనల్ లెవెల్ మానిటరింగ్ కమిటీ సభ్యులు గంగప్పా, డిఆర్డీఏ అధికారి విజయ్‌లు గ్రామాల్లో పర్యటించి కేంద్ర ప్రభుత్వ పథకాల తీరును పరిశీలించారు.
గ్రామాల్లో నిర్మించిన వైకుంఠధామాలు, ఉపాధి హామీ పథకం, పల్లె ప్రకృతి వనాలు, ఐకెపికి సంబంధించిన పనుల వివరాలను తెలుసుకొని రికార్డులను పరిశీలించారు కేంద్ర ప్రభుత్వం ద్వారా చేపట్టిన పనుల వివరాల రికార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీడీవో శంకర్, సర్పంచులు సాయరెడ్డి,రొడ్డ విజయ లింగం, కలీమ్ బేగ్, ఏపీఓ శరత్, తదితరులు ఉన్నారు.