ఆర్మూర్ జనవరి 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పండిత్ దీనదయాల్ ఉపాధ్యాయ సంస్థ ఆధ్వర్యంలో ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని భాషిత పాఠశాలలో శనివారం చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. చిత్రలేఖ పోటీలలో వివిధ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల నుండి 100 మంది వరకు విద్యార్థులు పాల్గొన్నారు.
పోటీలో పాల్గొన్న విజేతల ప్రకటనను 27వ తేదీ రోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ ‘‘పరీక్ష పే చర్చ’’ టీవీ కార్యక్రమం ఉదయం 10:30 గంటలకు భాషిత పాఠశాలలో నిర్వహించిన అనంతరం విజేతలకు బహుమతులను ప్రకటించడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు.
కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి, బిజెపి ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు జెస్సు అనిల్ కుమార్, కార్యక్రమ కన్వీనర్, బీజేవైఎం ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు కలిగోట ప్రశాంత్, సహకన్వినర్లు బీజేవైఎం ఆర్మూర్ పట్టణ ఉపాధ్యక్షులు సాయినాథ్ రెడ్డి, పెద్దోళ్ల భరత్, శివ తదితరులు పాల్గొన్నారు.