కామారెడ్డి, జనవరి 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని విద్యానికేతన్ హైస్కూల్లో తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఫస్ట్ జోనల్ రాజన్న జోన్ ఫారెస్ట్ స్పోర్ట్స్. గేమ్స్ మీట్ 2023 సంవత్సరానికి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజన్న జోన్ సిఎఫ్ సైదులు, కామారెడ్డి జిల్లా డిఎఫ్‌వో నికిత, సిద్దిపేట్ జిల్లా డిఎఫ్‌వో శ్రీనివాస్, కరీంనగర్ జిల్లా డిఎఫ్‌వో గోపాల్ రావు, మెదక్ జిల్లా డిఎఫ్‌వో రవి ప్రసాద్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి స్పోర్ట్స్ గేమ్స్ జెండా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా రాజన్న జోన్ సిఎఫ్ సైదులు, కామారెడ్డి జిల్లా డిఎఫ్‌వో నికిత మాట్లాడారు. రాజన్న ఫస్ట్ జోనల్ స్పోర్ట్స్ గేమ్స్ కామారెడ్డి జిల్లా కేంద్రంలోని విద్యానికేతన్ హైస్కూల్లో రెండు రోజులు నిర్వహించడం జరుగుతుందని, ఇందులో ఐదు జిల్లాలకు సంబంధించినటువంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి వారు పాల్గొనడం జరిగిందని తెలిపారు.
ఇందులో వివిధ రకాల ఆటల పోటీలు ఉన్నాయని ఇక్కడ గెలిచినవారు రాష్ట్రస్థాయిలో, రాష్ట్రస్థాయిలో గెలిచినవారు జాతీయస్థాయిలో ఆడే అవకాశం ఉంటుందని తెలిపారు. ఫస్ట్ జోనల్ రాజన్న సిరిసిల్ల జోన్ స్పోర్ట్స్ గేమ్స్ సహకరించినటువంటి విద్యానికేతన్ హైస్కూల్ యజమాన్యం వారికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో బాన్సువాడ ఎఫ్‌డివో సాగర్, తెలంగాణ ఫారెస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మోజమ్ అలీ ఖాన్, సోహెల్, టిఎన్‌జివోస్ రాజన్న సిరిసిల్ల జోన్ పద్మ, ఐదు జిల్లాల ఫారెస్ట్ అధికారులు పాల్గొన్నారు.