నిజామాబాద్, జనవరి 23
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : క్షణికావేశంలో ముగ్గురి ప్రాణాలు నిర్జీవంగా మారాయి. ఇద్దరు చిన్నారులు, తల్లి బాసర వద్ద గోదావరి నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన తల్లి తన ఇద్దరు పిల్లలతో గోదావరి నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సోమవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. ముగ్గురి ప్రాణాలు పోవడంతో స్థానికంగా విషాదఛాయలు అలముకున్నాయి.
వివరాలిలా ఉన్నాయి… నిజామాబాద్ జిల్లా కేంద్రం గోల్ హనుమాన్ పెద్ద బజార్ ప్రాంతానికి చెందిన మానస (27) ఇద్దరు పిల్లలు బాలాదిత్య (8) భవ్యశ్రీని (5) సోమవారం మధ్యాహ్నం పాఠశాల నుండి నేరుగా గోదావరి బాసర ప్రాంతం వద్దకు తీసుకువచ్చింది. తల్లి మానస చివరిసారిగా తన పిల్లలకి కడుపునిండా భోజనం తినిపించింది. అనంతరం పిల్లలు ఇద్దరితో కలిసి గోదావరి నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడిరది.
సమాచారం అందుకున్న ముధోల్ సీఐ వినోద్ కుమార్, బాసర ఎస్సై మహేష్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. వెంటనే గజ ఈత గాళ్ల సహయంతో మృతదేహాలను ఒడ్డుకు తీసుకువచ్చారు. మానస బంధుమిత్రుల సహకారంతో పూర్తి విషయాలు తెలుసుకుంటున్నట్టు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తును వేగవంతం చేస్తామని సీఐ వెల్లడిరచారు. క్షణికావేశంలో ఇలాంటి నిర్ణయాలు ఎవ్వరూ తీసుకోవద్దని ఆయన కోరారు. మూడు సంవత్సరాల క్రితం మానస భర్త చనిపోవడంతో ఆర్థిక ఇబ్బందులు తాళలేకే మానస ఆత్మహత్యకు పాల్పడిరదని స్థానికులు తెలిపారు.