కామారెడ్డి, జనవరి 23
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కల్తీకల్లు, నాటు సారా తయారు చేసిన, విక్రయించిన కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ప్రొహిబిషన్, ఎక్సైజ్ అధికారి ఎస్ రవీందర్ రాజు తెలిపారు. 2022 జూలై 1 నుంచి కామారెడ్డి జిల్లాలోని ఐదు ఎక్సైజ్ స్టేషన్లో పరిధిలో నమోదైన కేసుల వివరాలను సోమవారం తెలిపారు.
జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు కల్లు 167 షాంపిళ్లను సేకరించి రసాయనశాలకు పంపించి కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. కామారెడ్డి ఎక్సైజ్ ఆఫీస్ పరిధిలో 26, దోమకొండ 34, బాన్సువాడ 43, బిచ్కుంద 29 చొప్పున సేకరించినట్లు పేర్కొన్నారు.
కామారెడ్డి ఎస్ హెచ్ ఓ పరిధిలో కోరల్ హైడ్రేడ్ కల్తీ చేయబడిన కేసు ఒక నమోదు చేసినట్లు చెప్పారు. అల్ఫాజోలం రవాణాకు సంబంధించి ఒక కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. నాటుసారకు సంబంధించి 54 కేసులు, 138 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.