రెంజల్, జనవరి 23
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని గుర్తించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పరీక్ష పే చర్చ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని బోధన్ నియోజకవర్గ భాజపా సినియర్ నాయకులు వడ్డీ మోహన్ రెడ్డి, మేడపాటి ప్రకాష్ రెడ్డిలు అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు.
విద్యార్థుల్లో దాగివున్న ప్రతిభ, ఆత్మస్థైర్యం,పట్టుదలను పెంపొందించేందుకు ఇలాంటి పోటీలు ఎంతగానో దోహదపడతాయని విద్యార్థులు పరీక్షలు రాసే సమయంలో భయాందోళన తొలగించి, ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాయాలన్న సంకల్పంతో పరీక్షపై చర్చ అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని అన్నారు. అనంతరం పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను అందజేశారు.
స్వాతంత్య్ర సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ జయంతిని పురస్కరించుకొని బీజేపీ నాయకులు మోహన్ రెడ్డి, మెడపాటి ప్రకాష్ రెడ్డి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
కార్యక్రమంలో జడ్పిటిసి మేక విజయ సంతోష్,ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ బలరాం, బీజేపీ పార్టీ మండల అధ్యక్షుడు సుక్కరాజు, వైస్ ఎంపీపీ యోగేష్, పార్టీ మండల ప్రధాన కార్యదర్శులు ఎల్పీ పోచయ్య, సంగెం శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు గోపికృష్ణ, బోధన్ అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ కూరేళ్ల శ్రీధర్, పార్టీ జిల్లా కార్యదర్శి సుధాకర్ చారి, రచ్చ సుదర్శన్, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.