నిజామాబాద్, జనవరి 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కేశ వేణు ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎసిడి పేరుతో ప్రజల నుండి వసూలు చేస్తున్న అదనపు కరెంటు బిల్లుకు నిరసనగా మంగళవారం పవర్ హౌస్ వద్ద ధర్నా నిర్వహించి సుపరింటెండెంట్ ఇంజనీర్ రవీందర్‌కి మెమోరాండం అందజేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, పిసిసి ఉపాధ్యక్షులు తాహెర్ బీన్ హమ్దాన్, పిసిసి ప్రధాన కార్యదర్శి నగేష్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరం ప్రజల నుండి కరెంటు వినియోగంలో లోడు పెరుగుదల పేరుతో మూడు నుండి నాలుగు వేల రూపాయలు అధికంగా తీసుకుందని, అదేవిధంగా ఈ సంవత్సరం ఎసిడి పేరుతో ప్రజల దగ్గర నుండి రెండు నెలల కరెంటు బిల్లును ముందే తీసుకునే కుట్రను ప్రభుత్వం చేస్తుందని, అన్వల్ కన్జ్యూమర్ డిపాజిట్ పేరుతో రెండు నెలల కరెంట్ బిల్లును రాష్ట్ర ప్రభుత్వం ముందే డిపాజిట్ చేసుకొని తిరిగి మళ్ళీ ఎప్పుడు ప్రజలకు చెల్లిస్తారు అనేది క్లారిటీ ఇవ్వడం లేదని, ప్రజలు తమ ఇంటి మీటర్ ను రద్దు చేసుకున్నప్పుడు డిపాజిట్ డబ్బులు తిరిగి ఇస్తామని అధికారులు చెప్తున్నారు కానీ ఎవరు కూడా తమ ఇంటికి కరెంటు వద్దు అని అనుకోరు, కావున రాష్ట్ర ప్రభుత్వం తమ అసమర్థ పాలన కప్పిపుచ్చుకోవడానికి ప్రజల నుండి డిపాజిట్ పేరుతో డబ్బులు తీసుకుంటుందని ఇది సామాన్య ప్రజలపై భారం పడుతుంది కాబట్టి ప్రజలు ఎవ్వరు కూడా ఏసిడిని చెల్లించవద్దని ఎవరైనా విద్యుత్ శాఖ అధికారులు మీరు ఏఎస్‌డి చెల్లించకపోతే ఇంటి కరెంటును తొలగిస్తామని అంటే వారిపై తిరగబడండి, మీతో కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ తోడుగా పోరాడడానికి సిద్ధంగా ఉంటుందని మానాల మోహన్ రెడ్డి తెలిపారు.
ఈ సందర్భంగా నగర కాంగ్రెస్ అధ్యక్షులు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో ప్రజలను నడ్డివిరుస్తూ నియంతలా పాలన చేస్తున్నాడని ప్రభుత్వ అసమర్థత వలన విద్యుత్ సంస్థలో నష్టాలను పూడ్చడానికి నిరుపేద, మధ్యతరగతి ప్రజలపై ఎసిడి పేరుతో రెండు నెలల కరెంటు బిల్లులను బలవంతంగా టిఆర్‌ఎస్ ప్రభుత్వం ముందే వసూలు చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని, ప్రజలు ఎవరు కూడా ఏసిడిని చెల్లించవద్దని ఎసిడి రద్దు చేసేంత వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని కేశ వేణు అన్నారు.
కార్యక్రమంలో పీసీసీ కార్యదర్శులు రామకృష్ణ, మాజీద్ ఖాన్, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు విక్కీ యాదవ్, రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రామర్తి గోపి, జిల్లా ఎన్‌ఎస్‌యుఐ అధ్యక్షులు వేణు రాజ్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీరడీ భాగ్య, జిల్లా ఓబీసీ అధ్యక్షులు రాజ నరేంద్ర గౌడ్, జిల్లా మైనారిటీ అధ్యక్షులు ఇర్ఫాన్ అలీ, రాష్ట్ర ఎన్‌ఎస్‌యుఐ ప్రధాన కార్యదర్శి విపుల్ గౌడ్, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు అంతిరెడ్డి రాజారెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు రత్నాకర్, పిసిసి డెలికేట్ ఈసా, నిజామాబాద్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కేశ మహేష్, అబుద్ బిన్ హందాన్, 38వ డివిజన్ కార్పొరేటర్ రోహిత్, రాష్ట్ర మైనారిటీ ఉపాధ్యక్షులు ఉబెద్ బిన్ హందాన్, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పోల ఉష, కార్యదర్శి గాజుల సుజాత, నగర మైనారిటీ అధ్యక్షులు అబ్దుల్ ఏజాజ్, నగర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రేవతి, మోపాల్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు రవి, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సిరికొండ గంగారెడ్డి, కార్యదర్శి ఆశాబి, మలైకా బేగం, ప్రసాద్, నర్సింగ్ రావు, నవాజ్, జియ, కైసర్ తదితరులు పాల్గొన్నారు.