డిచ్‌పల్లి, జనవరి 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో అన్ని అనుబంధ కళాశాలలో గల బి.ఎడ్. కోర్సుకు చెందిన రెండవ సంవత్సరం 3 వ సెమిస్టర్స్ రెగ్యూలర్ పరీక్ల ఫీజు గడువు ఫిబ్రవరి 4 వ తేదీ వరకు ఉందని పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ షెడ్యూల్ విడుదల చేశారు. పరీక్షలు ఫిబ్రవరి నెలలో నిర్వహించ తలపెట్టినట్లు ఆమె పేర్కొన్నారు.
అంతేగాక 100 రూపాయల ఆలస్య అపరాధ రుసుముతో ఫిబ్రవరి 7 వ తేదీ వరకు, 200 రూపాయల ఆలస్య అపరాధ రుసుముతో ఫిబ్రవరి 8 వ తేదీ వరకు, 500 రూపాయల ఆలస్య అపరాధ రుసుముతో ఫిబ్రవరి 9 వ తేదీ వరకు పరీక్షా ఫీజు చెల్లించవచ్చని ఆమె పేర్కొన్నారు. కావున ఈ విషయాన్ని బి.ఎడ్. కళాశాలల ప్రధానాచార్యులు, విద్యార్థులు గమనించాలని కోరారు. పూర్తి వివరాలకు తెలంగాణ యూనివర్సిటి వెబ్ సైట్‌ను సందర్శించాలని సూచించారు.