బాన్సువాడ, జనవరి 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మార్కండేయ జయంతిని పురస్కరించుకుని మంగళవారం నాడు కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని మార్కండేయ మందిరంలో స్వామివారి జయంతి ఉత్సవాలను పద్మశాలి సంఘం, అభివృద్ధి కమిటీ, యువజన సంఘం, పద్మశాలి మహిళా సంఘం, మార్కండేయ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేసి స్వామి వారిని దర్శించుకుని పద్మశాలి సంఘం అధ్వర్యంలో నిర్వహించిన కలుశాల ఊరేగింపును జెండా ఉపి ప్రారంభించి, కలశం ఎత్తుకుని ఊరేగింపులో పాల్గొన్నారు.
ఊరేగింపు అనంతరం ఆలయ అర్చకులు పవన్ జోషి అర్చకత్వంలో భక్తులు స్వామివారి కి ప్రత్యేక అభిషేకాలు చేసారు. ధ్వజారోహణం, డొలరోహణం, పుష్పఅభిషేకం అనంతరం తీర్థప్రసాదాల వితరణ గావించారు. అలాగే దత్తు మహరాజ్ రాందాసి ద్వారా మార్కండేయ పురాణ ప్రవచనం గావించారు. ప్రముఖ వ్యాపార వేత్తలు గత్క నరహరి,గత్క శ్రీనివాస్ లు ప్రత్యేక పూలంకారనలో ఆలయాన్ని ముస్తాబు చేశారు.
మధ్యాహ్నం భక్తులకు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, ఆలయ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు గూడ శ్రీనివాస్, గెంట్యాల బాలక్రిష్ణ, పద్మశాలి సంఘ పెద్దలు జిల్లా కాశినాథ్,బాసం రాజులు, లక్క శ్రీనివాస్, పెండ్యాల అంజయ్య, అభివృద్ధి కమిటీ సభ్యులు నందల రామచందర్, బోడ నరహరి,మండల అధ్యక్షుడు అచ్చుగట్ల జీవన్, యువజన సంఘ అధ్యక్షలు అల్లి యోగి తో పాటు మహిళా సంఘం అధ్యక్ష,కార్యదర్శులు ఎర్ల విజయ లక్ష్మి, బిజి లత, కోశాధికారి వనం భాగ్యరేఖ, ఉపాధ్యక్షురాలు జంగం సీమ, సభ్యులు,మహిళలు, బాన్సువాడ పట్టణ ప్రజాప్రతినిధులు, నాయకులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.