నిజామాబాద్, జనవరి 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ఆవరణలో రిపబ్లిక్ డే ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి తెలిపారు. ఉదయం 10 గంటలకు జాతీయ పతాకావిష్కరణ గావించబడుతుందని అన్నారు.
అన్ని శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది ఉదయం 9.30 గంటల వరకు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం వద్దకు చేరుకుని గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనాలని సూచించారు. వేడుకలను అట్టహాసపు ఏర్పాట్ల నడుమ నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.