రిపబ్లిక్‌ డే కు ముస్తాబైన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం

నిజామాబాద్‌, జనవరి 25

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రిపబ్లిక్‌ డే ను పురస్కరించుకుని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో నిర్వహించనున్న గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి బుధవారం పరిశీలించారు. ఉదయం 10 గంటలకు జిల్లా పాలనాధికారి పతాకావిష్కరణ గావించనుండగా, ప్రజా ప్రతినిధులు, పుర ప్రముఖులు, ప్రజలు పాల్గోనున్నారు.

సమీకృత కార్యాలయాల సముదాయం అందుబాటులోకి వచ్చిన అనంతరం తొలిసారిగా జాతీయ పండుగను జరుపుకుంటున్న నేపథ్యంలో ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ అధికారులకు సూచించారు. ఇందులో భాగంగా సమీకృత కార్యాలయాల సముదాయం ఆవరణను అందంగా ముస్తాబు చేశారు. వేదికను రంగురంగుల పూలతో అందంగా అలంకరించి, ఆహుతుల కోసం షామియానాలు, కుర్చీలు ఏర్పాటు చేశారు.

పోలీస్‌ కమిషనర్‌ కేఆర్‌. నాగరాజు, అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌, ఆర్డీఓ రవి, కలెక్టరేట్‌ ఏ.ఓ ప్రశాంత్‌ తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆయా శాఖల ద్వారా అమలవుతున్న కార్యక్రమాలు, సాధించిన ప్రగతిని వివరించేలా స్టాల్స్‌ ఏర్పాటు చేస్తున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు, పోలీస్‌ పరేడ్‌ తదితర కార్యక్రమాల గురించి సంబంధిత అధికారులతో కలెక్టర్‌ ఇదివరకే సమీక్షించి, అవసరమైన సూచనలు చేశారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శనివారం, నవంబరు 23, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »