ఆర్మూర్, జనవరి 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బుదవారం 13వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఆలూర్ మండల పరిధిలో వివిధ గ్రామాల్లో 13వ ఓటర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అదేవిధంగా ఆలూర్ గ్రామంలో ఓటర్ల దినోత్సవం సందర్భంగా పాఠశాల విద్యార్థులకు ముగ్గుల పోటీలు, డ్రాయింగ్, పెయింటింగ్ పోటీలను నిర్వహించారు.
అదేవిధంగా ప్రజాస్వామ్యానికి సంబంధించిన విషయంలో వేసిన ముగ్గులకు ఒకటవ రెండవ, మూడవ బహుమతులను ప్రకటించారు. తరువాత గ్రామంలో ఓటర్ల దినోత్సవం ర్యాలీని నిర్వహించారు. కార్యక్రమంలో మండల పరిషత్ అధ్యక్షులు నరసయ్య, ఆలూరు గ్రామ సర్పంచ్ మోహన్ రెడ్డి, ఇతర వార్డు సభ్యులు, ప్రజా ప్రతినిధులు పాల్గొని ఓటర్ల దినోత్సవ ప్రాముఖ్యతను వివరించారు. అనంతరం జాతీయ ఎలక్షన్ ఎన్నికల సంఘం నుంచి పంపిన ఓటర్ల ప్రతిజ్ఞను చదివించి ప్రతిజ్ఞ చేశారు. ఎన్నికల సంఘం నుండి విడుదల చేసిన గీతాన్ని వినిపించి శుభాకాంక్షలు తెలిపారు.