కామారెడ్డి, జనవరి 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి ఫాక్సో కోర్టు భవనంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో బుధవారం కంటి వెలుగు శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ప్రారంభించారు. న్యాయవాదులు కంటి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి శ్రీదేవికి కళ్లద్దాలను కలెక్టర్ అందజేశారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి లక్ష్మణ్ సింగ్, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.