కామారెడ్డి, జనవరి 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : లింగంపేట్ మండలం పరిమల్ల గ్రామంలో తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం వాసవి క్లబ్ కామారెడ్డి, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్, శ్రీ కల్కి మానవ సేవా సమితి, రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరం విజయవంతమైందని నిర్వాహకులు తెలిపారు.
కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన లింగంపేట్ ఎస్సై శంకర్ మాట్లాడుతూ తలసేమియా చిన్నారుల కోసం పరిమల్ల గ్రామంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించడం అభినందనీయమని రక్త దాతలు ప్రాణదాతలు అన్నారు. రక్తదానం చేసిన రక్తదాతలకు ప్రశంస పత్రాలు అందజేశారు. రక్తదాన శిబిరం విజయవంతానికి గత పది రోజుల నుంచి ఎంతగానో కృషి చేసిన రాజా గౌడ్, పుట్ల అనిల్‌ను అభినందించారు.
కార్యక్రమాన్ని ఉద్దేశించి డాక్టర్ బాలు, విశ్వనాథులు మహేష్ గుప్తా మాట్లాడుతూ అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి రక్తాన్ని అందజేయడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నామని ఎవరికైనా రక్తం అవసరమైనట్లయితే 9492874006 నెంబర్‌కు సంప్రదించాలన్నారు. గత 15 సంవత్సరాల నుండి 16 వేల యూనిట్ల రక్తాన్ని సకాలంలో అందజేసి ప్రాణాలను కాపాడడం జరిగిందన్నారు. రక్తదానం చేసిన రక్తదాతలకు అభినందనలు తెలిపారు.
గత ఆరు నెలల్లో తల సేమియా చిన్నారుల కోసం 653 యూనిట్ల రక్తాన్ని అందజేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో పరమల్ల సర్పంచ్ పరువయ్య, ఎల్లారెడ్డి మార్కెట్ కమిటీ డైరెక్టర్ పతియోద్దీన్, రెడ్ క్రాస్ డివిజన్ సెక్రెటరీ జమీల్, కల్కిమానవ సేవా సమితి నిర్వాహకుడు ఎఱ్ఱం చంద్రశేఖర్, వాసవి క్లబ్ ప్రధాన కార్యదర్శి కొడిశాల శివకుమార్, అడ్లూరు ఎల్లారెడ్డి ఉప సర్పంచ్ చింతల లక్ష్మీపతి, భారతీయ కిసాన్ సంఫ్‌ు గ్రామ అధ్యక్షుడు ప్రభు రాజ్, సొసైటీ డైరెక్టర్లు సిద్ధిరాములు, శ్రీకాంత్ రెడ్డి, బోల్లు శ్రీకాంత్, గ్రామంలోని యూత్ సంఘాల సభ్యులు పాల్గొన్నారు.