కామారెడ్డి, జనవరి 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఓటు వజ్రాయుధం అని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో బుధవారం13వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. ఓటు చాలా పవిత్రమైందని తెలిపారు. దానిని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. నిజాయితీగల అభ్యర్థులకు ఓటు వేయాలన్నారు.
18 ఏళ్ల నిండిన యువతి, యువకులు ఓటర్ గా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. సంవత్సరానికి నాలుగు సార్లు రిజిస్ట్రేషన్ చేసుకునే వీలుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ ఓటర్ల ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా కొత్త ఓటర్లు తమ అభిప్రాయాలను తెలియజేశారు. మై భారత్ హో.. భారతదేశంలో అన్ని రకాల భాషలు ఉన్నాయని, కుల, మతాలకతీతంగా ఓటు హక్కు వినియోగించుకోవచ్చని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ట్రాన్స్ జెండర్లకు, దివ్యాంగులకు సన్మానం చేశారు. కొత్త ఓటర్లకు గుర్తింపు కార్డులను అందజేశారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ అన్యోన్య, శిక్షణ కలెక్టర్ శివేంద్రప్రతాప్, ఆర్డీవో శ్రీనివాసరెడ్డి, కలెక్టరేట్ ఎన్నికల పర్యవేక్షకుడు సాయి భుజంగరావు, ఏవో రవీందర్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కిష్టయ్య, వైస్ ప్రిన్సిపల్ చంద్రకాంత్, తెలుగు ప్రొఫెసర్ శంకర్, తాసిల్దార్ వెంకట్రావు, ఎన్నికల విభాగం అధికారులు నరేందర్, శ్రావణి, ఇంద్ర ప్రియదర్శిని పాల్గొన్నారు.