50 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మాణం
నిజామాబాద్, జనవరి 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ ప్రాంగణంలో నిర్మించ తలపెట్టిన ‘‘కళాభారతి’’ ఆడిటోరియం తుది నమూనాను గురువారం ముఖ్యమంత్రి కేసిఆర్ ఎంపిక చేశారని రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వెల్లడిరచారు. ఇందూరు వైభవాన్ని చాటేలా, ఇక్కడి సాంస్కృతిక, సాంప్రదాయాలు ఉట్టి పడేలా కళాభారతి నిర్మాణం ఉండబోతుందని మంత్రి తెలిపారు.
రూ. 50 కోట్ల ఖర్చుతో నిర్మించే కళాభారతి ఆడిటోరియంకు ఈనెల 28 నాడు ఉదయం 11 గంటలకు మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి కెటిఆర్ చేతుల మీదుగా భూమి పూజ చేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్బంగా నిజామాబాద్ జిల్లా ప్రజల పక్షాన, ప్రజాప్రతినిధుల పక్షాన ముఖ్యమంత్రి కేసిఆర్‌కి, మంత్రి కెటిఆర్‌కి మంత్రి వేముల ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.