నిజామాబాద్, జనవరి 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శనివారం రాష్ట్ర పురపాలక,పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కెటిఆర్ నిజామాబాద్‌లో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారని రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ఉదయం బేగంపేట విమానాశ్రయం నుండి హెలికాప్టర్ ద్వారా బయలుదేరి నిజామాబాద్ కలెక్టరేట్ చేరుకుంటారని, భూమారెడ్డి కన్వెన్షన్ హాల్‌లో రైతులతో జరుగు ముఖాముఖి భేటీలో పాల్గొంటారన్నారు.
అనంతరం కంఠేశ్వర్ రైల్వే అండర్ బ్రిడ్జ్‌ను ప్రారంభిస్తారని, రూ.50 కోట్ల అంచనా వ్యయంతో పాత కలెక్టరేట్ వద్ద నూతనంగా చేపట్టనున్న ‘‘కళాభారతి’’ ఆడిటోరియం నిర్మాణానికి భూమిపూజ, శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు.
అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతారని అన్నారు. ఆ తర్వాత అక్కడే భారత రాష్ట్ర సమితి నాయకులను కెటిఆర్ కలుస్తారని వెల్లడిరచారు. జిల్లా నలుమూలల నుండి బిఆర్‌ఎస్ నాయకులు అందరు పెద్ద ఎత్తున తెలంగాణ భవన్ తరలి రావాలని మంత్రి పిలుపునిచ్చారు.