బీర్కూర్, జనవరి 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కంటి వెలుగు పథకాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని మండల పంచాయతీ అధికారి రాము అన్నారు. మండలంలోని రాములగుట్ట తండాలో శుక్రవారం గ్రామ సర్పంచ్ గోపాల్‌తో కలిసి పథకాన్ని ప్రారంభించారు.
గ్రామంలోని కంటి సంభధిత సమస్యలు ఉన్నవారు పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంధి, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.