బకాయిలు వెంటనే చెల్లించాలి

కామారెడ్డి, జనవరి 30

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డ్వాక్రా సంఘాలకు సంబంధించి వడ్డీ లేని రుణాలు, స్త్రీ నిధి రుణాల వడ్డీ బకాయిలు, అభయ హస్తం డబ్బులు వెంటనే విడుదల చేయాలని రాజంపేట మండల కేంద్రంలో మహిళలు పెద్దమ్మ గుడి నుండి పురవీధుల్లో ర్యాలీ నిర్వహించి ఎంపిడివో కార్యాలయం వరకు చేరుకొని ఎంపిడివోకు వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జి కాటిపల్లి వెంకట రమణ రెడ్డి మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా మహిళా సంఘాలకు ప్రభుత్వం నుండి వడ్డీలేని రుణాల బకాయిలు చెల్లించడం లేదని, రావలసిన బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. మహిళల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యే వరకు మహిళలతో ఉద్యమం ఇలాగే కొనసాగుతుందని, వారికి అండగా బీజేపీ పోరాడుతుందని అన్నారు.

Check Also

బోధన్‌లో రోడ్డు భద్రతపై బాలికలకు అవగాహన

Print 🖨 PDF 📄 eBook 📱 బోధన్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోడ్డు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »