రెంజల్, జనవరి 30
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండలంలోని సాటాపూర్ గ్రామంలో శ్రీరామ మందిరం పునర్నిర్మిస్తున్న కోసం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రూ. 5 లక్షలు విరాళం ఇచ్చినట్లు సర్పంచ్‌ల ఫోరం జిల్లా ఉపాధ్యక్షుడు సాటాపూర్ గ్రామ సర్పంచ్ వికార్ పాషా తెలిపారు.
సాటాపూర్ బిఆర్‌ఎస్ పార్టీ నేతలు సోమవారం ఎమ్మెల్సీ కవితను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించారు. శ్రీరామ మందిరం పునర్నిర్మాణానికి విరాళం ఇచ్చిన సందర్భంగా గ్రామస్తుల తరపున ఎమ్మెల్సీ కవితకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో రామమందిర్ చైర్మన్ నితిన్, చంద్రశేఖర్, సాయిలు, బుడ్డోళ్ళ సాయిలు తదితరులు ఉన్నారు.