డిచ్‌పల్లి, జనవరి 30
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ యూనివర్సిటీ క్యాంపస్ గ్రౌండ్‌లో సోమవారం ఉదయం 11 గంటలకు హ్యాండ్‌బాల్ స్త్రీ, పురుషుల జట్ల ఎంపికలు జరిగినట్టు వర్సిటీ డైరెక్టర్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ డాక్టర్ సంపత్ తెలిపారు.
ఎంపికల నిమిత్తం వివిధ కళాశాలల నుండి మెన్ సెలక్షన్‌లో 35 మంది క్రీడాకారులు, ఉమెన్ సెలక్షన్స్‌లో 40 మంది క్రీడాకారులు పాల్గొన్నారని, ఇందులో మంచి ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఎంపిక చేశామని తెలిపారు. ఎంపికైన పురుషుల జట్టు సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ హ్యాండ్ బాల్ (మెన్) టోర్నమెంట్, సెలం తమిళనాడులో ఫిబ్రవరి 4 నుంచి 8 వరకు పాల్గొననుందని, ఎంపికైన స్త్రీల జట్టు 15-19 ఫిబ్రవరి 2023 తేదీలలో జరిగే సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ హ్యాండ్ బాల్ వుమెన్ టోర్నమెంట్ మహాత్మా గాంధీ యూనివర్సిటీ కొట్టయమ్ కేరళలో పాల్గొంటుందని తెలిపారు.
పై ఎంపికల ప్రారంభ కార్యక్రమానికి యూనివర్సిటీ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ సిహెచ్ ఆరతి ముఖ్యఅతిథిగా విచ్చేసి క్రీడాకారులను పరిచయం చేసుకొని సెలక్షన్స్ లో పాల్గొనుటకు వచ్చిన క్రీడాకారులందరిని అభినందించారు. ఎంపికలో ఫిజికల్ డైరెక్టర్స్ బాలమణి, స్వప్న, వర్షిని, వరలక్ష్మి, సౌమ్య, వర్సిటీ క్రీడా విభాగ సహాయ ఆచార్యులు (కాంట్రాక్ట్) డాక్టర్ బి.ఆర్ నేత, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.