Breaking News

Daily Archives: January 31, 2023

కిలిమంజోరా అధిరోహించిన వెన్నెలకు కలెక్టర్‌ అభినందన

కామారెడ్డి, జనవరి 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కిలిమంజోరా పర్వతాన్ని అధిరోహించిన బానోతు వెన్నెలను మంగళవారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అభినందించారు. జనవరి 26న గణతంత్ర దినోత్సవం రోజున కిలి మంజరో పర్వతాన్ని ఆమె అధిరోహించిందని తెలిపారు. భవిష్యత్తులో మౌంట్‌ ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహిస్తానని పర్వత అధిరోహిని బానోతు వెన్నెల పేర్కొన్నారు.

Read More »

నిజామాబాద్‌కు కొత్త కలెక్టర్‌

నిజామాబాద్‌, జనవరి 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 15 మంది ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఆదిలాబాద్‌ కలెక్టర్‌గా రాహుల్‌ రాజ్‌ కు బాధ్యతలు. వికారాబాద్‌ కలెక్టర్‌ గా నారాయణ రెడ్డి. కొమరం భీం ఆసిఫాబాద్‌ కలెక్టర్‌ గా షేక్‌ యస్మిన్‌ బాషాకు బాధ్యతలు. మహబూబ్‌ నగర్‌ కలెక్టర్‌ గా రవి. సూర్యపెట్‌ కలెక్టర్‌ గా వెంకట్‌ రావు. రంగారెడ్డి కలెక్టర్‌ గా …

Read More »

కంటి వెలుగు శిబిరాల నిర్వహణ భేష్‌

నిజామాబాద్‌, జనవరి 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దృష్టి లోపాలను దూరం చేసేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని జిల్లాలో సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి సంబంధిత అధికారులు, సిబ్బందిని అభినందించారు. ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదులకు ఆస్కారం లేకుండా చక్కటి సమన్వయంతో బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తిస్తున్నారని, కంటి వెలుగు శిబిరాలు ముగిసేంత వరకు కూడా ఇదే స్పూర్తితో ముందుకు సాగాలని సూచించారు. మంగళవారం సాయంత్రం …

Read More »

తారకరత్న ఆరోగ్యంపై చిరంజీవి ట్వీట్‌..

హైదరాబాద్‌, జనవరి 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన సినీ నటుడు నందమూరి తారకరత్నకు చికిత్స కొనసాగుతోంది. ఆయన త్వరగా కోలుకోవాలంటూ సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు కోరుకుంటున్నారు.. సోషల్‌ మీడియాలో ట్వీట్లు చేస్తున్నారు. తాజాగా మెగాస్టార్‌ చిరంజీవి తారకరత్న ఆరోగ్యంపై స్పందిస్తూ ట్వీట్‌ చేశారు. ‘’సోదరుడు తారకరత్న త్వరగా కోలుకుంటున్నారు. ఇంక ఏ ప్రమాదం లేదు అనే మాట ఎంతో ఉపశమనాన్నిచ్చింది. తను …

Read More »

ఆస్తి కోసం భర్తను చంపిన భార్య

బాన్సువాడ, జనవరి 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని తాడ్కొల్‌ గ్రామానికి చెందిన తుమ్మల వెంకటరెడ్డి ఈనెల 23న హత్యకు గురి కావడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టి భార్య అయిన తుమ్మల రుక్మిణి అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సిఐ మహేందర్‌ రెడ్డి తెలిపారు. వెంకట్‌ రెడ్డి తన ఆస్తిని అక్కచెల్లెళ్లకు ఇస్తానని చెప్పడంతో భార్య అయిన రుక్మిణి రోకలిబండతో చంపి వేసినట్లు ఒప్పుకోవడం జరిగిందని నిందితురాలిని …

Read More »

ఆడ బిడ్డలకు వరం – కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్‌

ఎల్లారెడ్డి జనవరి 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎల్లారెడ్డి నియోజకవర్గం సదాశివనగర్‌, రామారెడ్డి మండలాలలో రూ. 1 కోటి 45 లక్షల 16 వేల 820 విలువ గల 145 కళ్యాణ లక్షి, షాది ముభారక్‌ చెక్కులతో పాటు స్వంత ఖర్చులతో ప్రతి లబ్ధిదారురాలికి పట్టు చీరను ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్‌ పంపిణీ చేశారు. సదాశివనగర్‌, రామారెడ్డి మండలాలకు చెందిన 32 మందికి ఆసుపత్రిలో చికిత్స …

Read More »

నిబంధనల ప్రకారమే పిహెచ్‌డి కోర్సుల్లో ప్రవేశాలు

హైదరాబాద్‌, జనవరి 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిబంధనల ప్రకారమే పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశానికి అర్హత పరీక్షలు నిర్వహించామని… పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారు ఇంటర్వ్యూ కోసం దరఖాస్తు చేసుకోవాలని ఉస్మానియా విశ్వవిద్యాలయం ఓ ప్రకటనలో కోరింది. అర్హత పరీక్షల్లో ఉత్తీర్ణులు కాని కొద్ది మంది అనవసర రాద్దాంతం చేస్తున్నారని స్పష్టం చేసింది. యూజీసీ నిబంధనల ప్రకారమే నడుచుకుంటున్నామని…. ఇకపై ఏటా పి.హెచ్‌.డి ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు …

Read More »

ఏసీడి చార్జీలను రద్దు చేయాలి

నిజామాబాద్‌, జనవరి 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఏసీడి పేరుతో ప్రజలపై వేస్తున్న అదనపు చార్జీలను ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తూ సీపీఐ (ఎం.ఎల్‌) ప్రజాపంథా పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా నిజామాబాద్‌ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఐటిఐ నుండి వర్ని చౌరస్తాలో గల విద్యుత్‌ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా నిర్వహించారు. ఎస్‌.ఈ స్పందించకపోవడంతో ప్రజాపంథా నాయకులు కార్యాలయంలోకి చొచ్చుకెళ్లే …

Read More »

డబ్బులు వచ్చే వరకు బిజెపి అండగా ఉంటుంది

కామారెడ్డి, జనవరి 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం బకాయి పడిన వడ్డీ లేని రుణాల బకాయిలు, స్రీ నిధి వడ్డీ, అభయ హస్తం డబ్బులు వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జి కాటిపల్లి వెంకట రమణ రెడ్డి ఆధ్వర్యంలో దోమకొండ మండలంలోని అన్ని గ్రామాల మహిళలు మండల కేంద్రంలో నిరసన ర్యాలీ చేపట్టారు, అనంతరం ఎంపిడివో కార్యాలయానికి చేరుకుని వినతి …

Read More »

కాంగ్రెస్‌ నేతకు బహిరంగ క్షమాపణ చెప్పాలి

కామరెడ్డి, జనవరి 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రామారెడ్డి మండల రైతు బందు అధ్యక్షులు గుర్జల నారాయణ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీ జెడ్పీటీసీ ప్లోర్‌ లీడర్‌ నా రెడ్డి మోహన్‌ రెడ్డికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని ఉప్పల్‌ వాయి గ్రామ మాజీ కారోబార్‌ దోనుకంటి కుమార్‌ డిమాండ్‌ చేశారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఉప్పలవాయి గ్రామంలో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »