ఎల్లారెడ్డి జనవరి 31
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎల్లారెడ్డి నియోజకవర్గం సదాశివనగర్, రామారెడ్డి మండలాలలో రూ. 1 కోటి 45 లక్షల 16 వేల 820 విలువ గల 145 కళ్యాణ లక్షి, షాది ముభారక్ చెక్కులతో పాటు స్వంత ఖర్చులతో ప్రతి లబ్ధిదారురాలికి పట్టు చీరను ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ పంపిణీ చేశారు.
సదాశివనగర్, రామారెడ్డి మండలాలకు చెందిన 32 మందికి ఆసుపత్రిలో చికిత్స పొందిన బిల్లులను ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా రూ. 11 లక్షల 6 వేల విలువ గల సిఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.
కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట ఆయా మండలాల నాయకులు, ప్రజా ప్రతినిధులు, సొసైటీ చైర్మన్లు, బి.ఆర్.యస్ మండల, గ్రామ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.