కామారెడ్డి, జనవరి 31
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కిలిమంజోరా పర్వతాన్ని అధిరోహించిన బానోతు వెన్నెలను మంగళవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అభినందించారు.
జనవరి 26న గణతంత్ర దినోత్సవం రోజున కిలి మంజరో పర్వతాన్ని ఆమె అధిరోహించిందని తెలిపారు. భవిష్యత్తులో మౌంట్ ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహిస్తానని పర్వత అధిరోహిని బానోతు వెన్నెల పేర్కొన్నారు.