కామరెడ్డి, జనవరి 31
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రామారెడ్డి మండల రైతు బందు అధ్యక్షులు గుర్జల నారాయణ రెడ్డి కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీ ప్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని ఉప్పల్ వాయి గ్రామ మాజీ కారోబార్ దోనుకంటి కుమార్ డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఉప్పలవాయి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా గామ మాజీ కారొబార్ దొనుకంటి కుమార్ మాట్లాడుతూ రైతు బందు మండల అధ్యక్షులు గుర్జల నారాయణరెడ్డి నీకు కాంగ్రెస్ పార్టీ జెడ్పిటిసి ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. సొసైటీ ఎలక్షన్లో నీ ఓటు నీవు వేసుకోలేకపోయావు అలాంటి వ్యక్తివి నీవు అన్నారు. నా రెడ్డి స్వచ్ఛంద సంస్థ ద్వారా ఎంతోమందికి నిరుపేద ప్రజలకు సేవ చేస్తున్నారని అన్నారు.
కనీసం నీవు 20 సంవత్సరాల రాజకీయంలో ఎవరికైనా ఉప్పల్ వాయి గ్రామంలో రెండు వేల రూపాయలు ఇచ్చిన దాఖలు లేవని అన్నారు. ఉప్పల్ వాయి గ్రామంలో సొసైటీ డైరెక్టర్‌గా తనను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే సాయిబాబా దేవాలయానికి రెండు లక్షల రూపాయలు ఇస్తానని చెప్పి ఇప్పటికి నాలుగు సంవత్సరాలు అయితుందని, సొసైటీ డైరెక్టర్ అయిన తర్వాత ఆ విషయాన్ని మరిచిపోయావని గుర్తుచేశారు.
బిటి రోడ్‌కు, ఆర్‌అండ్‌బి రోడ్డుకు నీకు తేడా తెలియదన్నారు. ప్రభుత్వం నీకు బతుకు దెరువు కొరకు ట్రాక్టర్, హార్వెస్టర్ ఇస్తే వాటిని కూడా అమ్ముకోవడం జరిగిందని అన్నారు. ఇప్పటికైనా గుర్జాల నారాయణరెడ్డి కాంగ్రెస్ పార్టీ జెడ్పిటిసి ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి గురించి మాట్లాడిన మాటలను వెనక్కి తీసుకొని బహిరంగంగా క్షమాపణ చెప్పాలని, లేకపోతే నిన్ను కూడా రాబోయే రోజులలో గ్రామంలో తిరగనియ్యమని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏన్నం రామ్ రెడ్డి, సంకిరాజు, పంగ బబ్లు, జంగిటి నారాయణ, కుమ్మరి శంకర్, సూరంపల్లి శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.