రెంజల్, జనవరి 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండలంలోని నీల క్యాంప్‌లో ఎఫ్‌ఎంసీ కంపెనీ వారి ఆధ్వర్యంలో వరి పంటలో క్షేత్ర ప్రదర్శన నిర్వహించారు. రైతు దాసు గారి పొలంలో వారం రోజుల క్రితం ఎఫ్.ఎం.సి. వారి కర్ప్రైమ అనే మందును వాడి మోగి పురుగు, ఆకు చుట్టు పురుగు మరియు పచ్చపురుగులను సమర్థవంతంగా నియంత్రించడంతో పాటు పంట ఏపుగా పెరగడం జరిగింది. ఈ మేరకు …
Read More »Monthly Archives: January 2023
కేంద్ర ప్రభుత్వ పథకాలపై పరిశీలన
రెంజల్, జనవరి 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కేంద్ర ప్రభుత్వ పథకాలు గ్రామస్థాయిలో అమలు తీరుపై శుక్రవారం మండలంలోని దూపల్లి, కూనేపల్లి, కందకుర్తి గ్రామాలలో నేషనల్ లెవెల్ మానిటరింగ్ కమిటీ సభ్యులు గంగప్పా, డిఆర్డీఏ అధికారి విజయ్‌లు గ్రామాల్లో పర్యటించి కేంద్ర ప్రభుత్వ పథకాల తీరును పరిశీలించారు. గ్రామాల్లో నిర్మించిన వైకుంఠధామాలు, ఉపాధి హామీ పథకం, పల్లె ప్రకృతి వనాలు, ఐకెపికి సంబంధించిన పనుల వివరాలను తెలుసుకొని …
Read More »అనీమియా వ్యాధిగ్రస్తుడికి రక్తదానం…
కామారెడ్డి, జనవరి 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా బిబీపేట్ మండలం తుజాల్ పూర్ గ్రామానికి చెందిన తలారి సుధాకర్ (40) అనీమియా వ్యాధితో బాధపడుతుండడంతో అత్యవసరంగా బి పాజిటివ్ రక్తం 3 యూనిట్లు అవసరం కావడంతో వారికి కావలసిన రక్తం రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో వారి కుటుంబ సభ్యులు రెడ్ క్రాస్ జిల్లా మరియు ఐవిఎఫ్ తెలంగాణ తెలంగాణ రాష్ట్ర రక్తదాతల సమన్వయకర్త డాక్టర్ …
Read More »మాస్టర్ ప్లాన్ ప్రక్రియ నిలిపివేత
కామారెడ్డి, జనవరి 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ప్రక్రియను నిలిపివేస్తామని మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం ఆయన జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే, మున్సిపల్ కమిషనర్ దేవేందర్ లతో మాస్టర్ ప్లాన్ ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు. రైతుల, ప్రజల నుంచి …
Read More »ఆప్యాయంగా పలకరిస్తు ఆరోగ్య సమస్యలు తెలుసుకున్న కలెక్టర్
నిజామాబాద్, జనవరి 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దృష్టి లోపాలను దూరం చేసేందుకు వీలుగా ప్రభుత్వం నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాలను కలెక్టర్ సి.నారాయణ రెడ్డి శుక్రవారం సందర్శించారు. మండల కేంద్రమైన నవీపేట్ తో పాటు అదే మండలంలోని అభంగపట్నంలో కొనసాగుతున్న కేంద్రాలలో కంటి శిబిరాల నిర్వహణ తీరును నిశితంగా పరిశీలించారు. నేత్ర పరీక్షలు చేయించుకునేందుకు వచ్చిన వారిని ఆప్యాయంగా పలకరిస్తూ, వారి ఆరోగ్య సమస్యల గురించి …
Read More »’కంటి వెలుగు’ మానవత్వంతో కూడిన కార్యక్రమం
నిజామాబాద్, జనవరి 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దృష్టి లోపాలను దూరం చేయాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘కంటి వెలుగు’ కార్యక్రమం మానవత్వం ఇమిడి ఉన్న ఎంతో గొప్ప కార్యక్రమమని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖామాత్యులు వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు-2 కార్యక్రమాన్ని నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వినాయక నగర్‌లో గల స్త్రీ స్వశక్తి భవన్‌లో మంత్రి వేముల ప్రశాంత్ …
Read More »ప్రజల కోసం ప్రభుత్వం చేపట్టిన గొప్ప కార్యక్రమం కంటి వెలుగు
కామారెడ్డి, జనవరి 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సంపూర్ణ అంధత్వ నిర్మూలనే లక్ష్యంగా కంటి వెలుగు కార్యక్రమంను తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బాన్సువాడలో గురువారం రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వ అత్యంత ప్రతిష్టాత్మకంగా కంటి వెలుగు కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు. జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని …
Read More »18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు నేత్ర పరీక్షలు చేయించుకోవాలి
కామారెడ్డి, జనవరి 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దృష్టిలోపాలను దూరం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిందని రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ ముజీబుద్దిన్ అన్నారు. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో 18వ వార్డులో గురువారం కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు నేత్ర పరీక్షలు చేయించుకోవాలన్నారు. జిల్లావ్యాప్తంగా 44 …
Read More »బోధన్‌లో ప్రారంభమైన కంటివెలుగు
బోధన్, జనవరి 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దృష్టి లోపాలను దూరం చేయాలనీ ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రతిష్టత్మాకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు- 2 కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని బోధన్ ఎంపీపీ బుద్దె సావిత్రి రాజేశ్వర్ అన్నారు. గురువారం బోధన్ శాసనసభ్యులు ఎండీ షకీల్ ఆమ్మేర్ ఆదేశాల మేరకు గురువారం సాలూర మండలం సాలూర, సాలంపాడ్, గ్రామాలలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ఆమె …
Read More »రైతుల ఉద్యమం పట్ల స్పందించక పోతే రాజీనామా చేస్తాం
కామారెడ్డి, జనవరి 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి మున్సిపల్ కొత్త మాస్టర్ ప్లాన్ వల్ల నష్టపోతున్న రైతులకు మద్దతుగా, ప్రభుత్వ దోరణిలో నిరసనగా తాము 23 వ తేదీన రాజీనామా చేస్తామని బీజేపీ కౌన్సిలర్‌లు తెలిపారు. ఈ సందర్భంగా బీజేపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మొటూరి శ్రీకాంత్ మాట్లాడుతూ కొత్త మాస్టర్ ప్లాన్ వల్ల నష్టపోతున్న రైతులు ఎన్నో ఉద్యమాలు చేసిన అనంతరం స్పందన లేకపోవటంతో …
Read More »