Monthly Archives: January 2023

గణతంత్ర దినోత్సవం కోసం కొన్ని నినాదాలు..

జై బోలో గణతంత్ర భారత్‌ కి- జై.. భారత రాజ్యాంగం వర్ధిల్లాలి రాజ్యాంగ లక్ష్యాలను- సాధిద్దాం సాధిద్దాం.. రాజ్యాంగాన్ని ….- రక్షించుకుందాం.. రాజ్యాంగకర్త ఆశయాలను- కొనసాగిద్దాం.. గణతంత్రం – వర్ధిల్లాలి.. ప్రజాస్వామ్యం – వర్ధిల్లాలి.. సార్వభౌమత్వం – వర్ధిల్లాలి. లౌకికత్వం – వర్ధిల్లాలి…

Read More »

సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు

నిజామాబాద్‌, జనవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ఆవరణలో రిపబ్లిక్‌ డే ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి తెలిపారు. ఉదయం 10 గంటలకు జాతీయ పతాకావిష్కరణ గావించబడుతుందని అన్నారు. అన్ని శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది ఉదయం 9.30 గంటల వరకు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం వద్దకు చేరుకుని గణతంత్ర దినోత్సవ వేడుకల్లో …

Read More »

అచ్చంపేటలో కంటివెలుగు శిబిరాన్ని సందర్శించిన కలెక్టర్‌

నిజాంసాగర్‌, జనవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలం అచ్చంపేటలో కంటి వెలుగు శిబిరాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 18 ఏళ్ల నిండిన ప్రతి ఒక్కరు ఈ శిబిరం ద్వారా కంటి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కంటి వెలుగు కార్యక్రమం ద్వారా ఎంత మందికి కంటి …

Read More »

అంగరంగ వైభవంగా మార్కండేయ జయంతి ఉత్సవాలు..

బాన్సువాడ, జనవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మార్కండేయ జయంతిని పురస్కరించుకుని మంగళవారం నాడు కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని మార్కండేయ మందిరంలో స్వామివారి జయంతి ఉత్సవాలను పద్మశాలి సంఘం, అభివృద్ధి కమిటీ, యువజన సంఘం, పద్మశాలి మహిళా సంఘం, మార్కండేయ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా డిసిసిబి చైర్మన్‌ పోచారం భాస్కర్‌ రెడ్డి …

Read More »

సమస్యలు వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కోవాలి

నిజామాబాద్‌, జనవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జీవితం కష్టసుఖాల సమాహారమని, సమస్యలు వచ్చినప్పుడు కుంగిపోకుండా వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి ఉద్బోధించారు. ఆత్మస్థైర్యంతో ముందుకు సాగితే, జీవితంలో ఎదురయ్యే ఎలాంటి సమస్యనైనా అధిగమించవచ్చని అన్నారు. జాతీయ బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకుని మోపాల్‌ మండలం బోర్గం(పి) పాఠశాలలో విద్యార్థినులకు స్వీయ ఆత్మరక్షణ కోసం ఏర్పాటు చేసిన కరాటే శిక్షణ తరగతులను కలెక్టర్‌ మంగళవారం లాంఛనంగా ప్రారంభించారు. …

Read More »

కామరెడ్డిని పొగాకు రహిత జిల్లాగా మార్చాలి

కామారెడ్డి, జనవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాను పొగాకు రహిత జిల్లాగా మార్చాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలో మంగళవారం పొగాకు నియంత్రణ జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశం, సామర్థ్యం పెంపు పొగాకు రహిత కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పొగాకు తాగకుండా ప్రతి ఒక్కరు …

Read More »

ఫిబ్రవరి 4 వరకు పరీక్ష ఫీజు గడువు

డిచ్‌పల్లి, జనవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో అన్ని అనుబంధ కళాశాలలో గల బి.ఎడ్‌. కోర్సుకు చెందిన రెండవ సంవత్సరం 3 వ సెమిస్టర్స్‌ రెగ్యూలర్‌ పరీక్ల ఫీజు గడువు ఫిబ్రవరి 4 వ తేదీ వరకు ఉందని పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ షెడ్యూల్‌ విడుదల చేశారు. పరీక్షలు ఫిబ్రవరి నెలలో నిర్వహించ తలపెట్టినట్లు ఆమె పేర్కొన్నారు. అంతేగాక 100 రూపాయల …

Read More »

కంటి వెలుగు శిబిరాలను తనిఖీ చేసిన కలెక్టర్‌

నిజామాబాద్‌, జనవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దృష్టి లోపాలను నివారించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాలను కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి మంగళవారం తనిఖీ చేశారు. మోపాల్‌ మండలంలోని ముదక్‌పల్లి, న్యాల్కల్‌ గ్రామాలలో కొనసాగుతున్న కేంద్రాలలో కంటి శిబిరాల నిర్వహణ తీరును ఒక్కో టేబుల్‌ వారీగా తిరుగుతూ క్షుణ్ణంగా పరిశీలించారు. నేత్ర పరీక్షలు చేయించుకునేందుకు వచ్చిన వారిని దృష్టి లోపాల గురించి అడిగి తెలుసుకున్నారు. …

Read More »

ఆడపిల్లలు సమాజానికి మణిహారం

నిజామాబాద్‌, జనవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాతీయ బాలికల దినోత్సవ వేడుకల్లో భాగంగా మంగళవారం నిజామాబాద్‌ నగరంలోని న్యూ అంబేద్కర్‌ భవన్లో జిల్లా మహిళ, శిశు, సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో (బిబిబిపి పథకంలో భాగంగా) పెద్ద ఎత్తున జాతీయ బాలికల దినోత్సవం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా పరిషత్‌ చైర్మన్‌ దాదన్న గారి విటల్‌ రావు మాట్లాడుతూ ప్రతి కుటుంబంలో బాలికలను ఉన్నత చదువులు …

Read More »

ఏసీడి చార్జీలు చెల్లించకండి

నిజామాబాద్‌, జనవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నగర కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షులు కేశ వేణు ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎసిడి పేరుతో ప్రజల నుండి వసూలు చేస్తున్న అదనపు కరెంటు బిల్లుకు నిరసనగా మంగళవారం పవర్‌ హౌస్‌ వద్ద ధర్నా నిర్వహించి సుపరింటెండెంట్‌ ఇంజనీర్‌ రవీందర్‌కి మెమోరాండం అందజేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్‌ రెడ్డి, పిసిసి ఉపాధ్యక్షులు …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »